ప్రజాశక్తి-చోడవరం
చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంపీసీ కంప్యూటర్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని గాయత్రి జాతీయ మహిళల రెజ్లింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించింది. ఇటీవల విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి మహిళా రెజ్లింగ్ పోటీల్లో గాయత్రి పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు గాయత్రిని మంగళవారం డాక్టర్ పి.కిరణ్ కుమార్ ఇతర అధ్యాపక బృందం అభినందించారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్ మాట్లాడుతూ గాయత్రి ఆటల్లోనే కాకుండా చదువులోనూ చక్కటి ప్రతిభ కనపర్చుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడి మూర్తి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డి.మాల్యాద్రి, డాక్టర్ రత్న భారతి, పిచ్చమ్మ, వి.అప్పలనాయుడు, హెచ్ సుధీర్, డాక్టర్ మల్లి బాబు, నారాయణ మూర్తి, డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ సూర్యవతి, డాక్టర్ జ్యోతి, డాక్టర్ లక్ష్మీ మంగమ్మ, జి వెంకటేష్, రామలక్ష్మి, సరస్వతి కోమల, తాతారావు, శ్రీనివాసరావు, రాజేష్ పాల్గొన్నారు.