పరిశ్రమలకనుగుణంగా గీతం కెమిస్ట్రీ కోర్సులు

May 16,2024 23:27 #chemistry, #Gitam
Gitam, chemistry courses

 ప్రజాశక్తి -మధురవాడ : పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ రసాయన శాస్త్రవిభాగం బోధన, పరిశోధన కార్యకలాపాలను నిర్వహిస్తోందని గీతం రసాయన శాస్త్రవిభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎన్‌విఎస్‌.వేణుగోపాల్‌ తెలిపారు. నగరంలోని వివిధ కళాశాల విద్యార్థులకు గురువారం నిర్వహించిన ”రసాయన శాస్త్రం- ఉజ్వల భవిష్యత్తు” సదస్సులో ఆయన ప్రసంగించారు. ఔషధ రంగం నుంచి అణు ఉత్పాదన రంగం వరకు రసాయన శాస్త్రం విస్తరించిందని పేర్కొన్నారు. ఔషధ పరిశ్రమలు లారెస్‌ ల్యాబ్‌, రెడ్డీస్‌ ల్యాబ్‌, ఫైజర్‌ హెల్త్‌ కేర్‌లతో తమ విభాగానికి అవగాహన ఒప్పందాలు ఉన్నాయన్నారు. గీతం రసాయన శాస్త్ర విభాగం ప్రముఖ పరిశ్రమలకు తగిన విధంగా కోర్సులను రూపొందిస్తోందని, ఈ కారణంగా డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు నూరు శాతం ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని వెల్లడిరచారు. రసాయన శాస్త్రంలో నానో సైన్స్‌, గ్రీన్‌ కెమిస్ట్రీ, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, మెటిరియల్‌ సైన్స్‌, ఆర్గానిక్‌, సింథసిస్‌లపై గీతంలో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 100కు పైగా పిహెచ్‌డిలను విభాగం ద్వారా పరిశోధకులు అందుకున్నారని తెలిపారు. గీతం రసాయన శాస్త్ర విభాగానికి కేంద్ర పరిశోధన సంస్థలు డిఎస్‌టితో సహ సిఎస్‌ఐఆర్‌ పరిశోధన ప్రాజెక్టులను అప్పగించాయని తెలిపారు. విద్యార్థుల సందేహలను నివృత్తి చేశారు.

➡️