ప్రజాశక్తి -మధురవాడ : గీతం వర్సిటీ బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న గీతం ఎక్స్‌లెన్స్ మీట్ (జెమ్)25 శుక్రవారం ముగిసింది. స్టాక్ ఎక్సేంజ్ ఉపాధ్యక్షుడు ఎస్.రంగనాధన్ పాల్గొని వివిధ పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ రాజా ఫణిపప్పు మాట్లాడుతూ భావి యువతలో నాయకత్వ లక్షణాలతో బలోపేతమే లక్ష్యంగా నిర్వహించిన జెమ్25లో కార్పొరేట్ సంస్థల నిపుణులు హజరై యువతకు దిశానిర్ధేశ్యం చేశారు. వాణిజ్య అంశాలపై వర్క్‌షాపులో సమకాలీన కార్పొరేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శలను అలరించాయి. కార్యక్రమంలో జెమ్ కన్వీనర్ డాక్టర్ బి.కృష్ణకుమారి, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్‌ఎస్.మిశ్రా, కో సిఇఒ కె.చెర్రి హేడ్స్, గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇన్‌ఛార్జి డైరక్టర్ డాక్టర్ కె.లుబ్జా నిహార్ పాల్గొన్నారు..
జెమ్ ముగింపోత్సవంలో సాంస్కృతిక ప్రదర్శన