పారిశుధ్య మెరుగుదలకు కృషి : గఫార్‌

ప్రజాశక్తి -కనిగిరి : ప్రజారోగ్యం రక్షణలో మెరుగైన పారిశుధ్యం కీలకమని, పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కనిగిరి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ హెచ్చరించారు. సమస్య- పరిష్కారం కార్యక్రమంలో భాగంగా కనిగిరి మున్సిపాలిటీ 20 వ వార్డులోని సాగర్‌ నీళ్ల ట్యాంకుల ప్రాంతంలో మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పారిశుధ్యం గురించి ఫిర్యాదు చేశారు. దీంతో చైర్మన్‌ ఆ ప్రాంతంలో పర్యటించి అక్కడి ప్రజలతో క్షేత్రస్థాయిలో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులను పిలిపించారు. ఆ ప్రాంతంలో పారిశుధ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉండేందుకు మరియు పారిశుధ్యం మెరుగుపడే విధంగా ప్రజలు కూడా సహకరించాలని చైర్మన్‌ కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ కార్యదర్శి మాలకొండయ్య, సూపర్‌ వైజర్‌ ఖాదర్‌బాషా, స్థానిక నాయకులు ఖాజా మొదీన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️