చదువులో రాణిస్తున్న విద్యార్థినికి సైకిల్‌ బహూకరణ

Feb 13,2024 13:09 #bicycle, #Gift, #student, #studies

ప్రజాశక్తి-అన్నవరం (కాకినాడ) : చదువులోనూ, ఇతర ఆటపాటల్లో ఆల్‌ రౌండర్‌ గా రాణిస్తున్న మధ్య తరగతి కుటుంబానికి చెందిన విద్యార్థినికి అన్నవరం సత్య దేవా లైన్స్‌ క్లబ్‌ ఒక సైకిల్‌ బహూకరించింది. దేవస్థానం హై స్కూల్‌ లో చదువుతున్న పెండ్యాల దార హాశినికి మంగళవారం క్లబ్‌ ప్రతినిధులు డొంకాడ గిరి ఉమాదేవి దంపతులు హైస్కూల్‌ ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు చేతులమీదుగా విద్యార్థినికి సైకిల్‌ అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏ బుచ్చిబాబు, పి వీరేశం పాల్గొన్నారు

➡️