తైవాన్‌ నుంచి బహుమతులు

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని ఐలవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు తైవాన్‌ దేశం మున్సిపల్‌ పూహి జూనియర్‌ హై స్కూల్‌ నుంచి మంగళవారం గిఫ్ట్‌లు చేరాయి. గత మే నెలలో ఆంగ్ల ఉపాధ్యాయులు వచ్చారు. హరికృష్ణ, అక్కడి జూనియర్‌ హైస్కూల్‌ ఉపాధ్యాయురాలు టిఫినీ లీవెన్‌ ఫన్‌లు స్కైప్‌ ద్వారా జరిపిన సంభాషణలతో విద్యార్థులు ఇరువురు వారి వారి దేశాల జీవనశైలిని గురించి ఒక ప్రాజెక్టును నిర్వహించారు. దీనిని కొన సాగింపుగా అక్కడి పాఠశాల ఉపాధ్యాయురాలితో పాటు విద్యా ర్థులు ఐలవరం విద్యార్థులకు గిఫ్టును పంపించారు. ఈ గిఫ్ట్‌లో పెన్నులు, చాక్లెట్లు, బిస్కెట్లతో పాటు సర్టిఫికెట్లు కూడా ఉన్నా యి. వీటిని పాఠశాల హెచ్‌ఎం మాచర్ల మోహనరావు ఆవిష్క రించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

➡️