ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ప్రజాశక్తి-రాయచోటి ఇంటర్‌ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. అన్నమయ్య జిల్లా 2025 అకడమిక్‌ ఇయర్‌లో 60 శాతంలో మొదటి సంవంత్సరం 23, 80 శాతంలో ద్వితీయ సంవత్సరం 14 స్థానాల్లో నిలిచింది. గత ఏడాడితో పోల్చితే ఒక స్థానం తగ్గింది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 13,108 మంది విద్యార్థులు హాజరు కాగా 7814 మంది విద్యార్థులు పాసై 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 11,486 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా అందులో 9,175 మంది విద్యార్థులు పాస్‌ కాగా 80 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ మొదటి సంవత్సరం 991 మంది విద్యా ర్థులు పరీక్ష రాయగా 771 మంది పాస్‌ కాగా 71 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ ద్వితీయ సంవత్సరంలో 895 మంది పరీక్ష రాయగా 702 మంది పాస్‌ కాగా 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ఫలితాలలో అన్నమయ్య జిల్లా రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో 23వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 14వ స్థానంలో నిలించింది. ఎపి రేసి జూనియర్‌ కాలేజ్‌ మొదటి సంవత్సరం 222 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 210 మంది విద్యార్థులు పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 216 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 215 మంది విద్యార్థులు పాసయ్యారు. ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం 55 మంది పరీక్ష రాయగా 53 మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 102 మంది పరీక్ష రాయగా 97 మంది పాసయ్యారు. ఎపిఎస్‌డబ్ల్యూ రెసిడె న్షియల్‌ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం 513 మంది విద్యా ర్థులు పరీక్ష రాయగా 411 మంది పాసయ్యారు.ద్వితీయ సంవత్సరంలో 434 మంది పరీక్ష రాయిగా 383 మంది పాసయ్యారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశా లలో మొదటి సంవత్సరం 2268 మంది పరీక్ష రాయగా 1247 మంది పాస య్యారు. ద్వితీయ సంవత్సరంలో 2037 మంది విద్యార్థులు హాజరు కాక 1549 మంది పాసయ్యారు. హైస్కూల్‌ ప్లస్‌ మొదట సంవత్సరంలో 333 మంది విద్యా ర్థులు పరీక్షకు రాయగా 80 మంది మాత్రమే పాసయ్యారు. ద్వితీయ సంవత్స రంలో 66 మంది పరీక్షలు రాధిక 43 మంది మాత్రమే పాస్‌ అయ్యారు. కెజిబివి జూని యర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం 401 మంది పరీక్ష రాయిగా 290 మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 289 మంది పరీక్ష రాయగా 245 మంది పాసయ్యారు. మోడల్‌ స్కూల్‌ మొదటి సంవత్సరంలో 1520 మంది పరీక్ష రాయిగా1036 మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 1074 మంది పరీక్ష రాయగా 905 మంది పాసయ్యారు. ప్రయివేట్‌ యునైడెడ్‌ జూని యర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం 7648 మంది పరీక్ష రాయిగా 4355 మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 7134 మంది పరీక్ష రాయిగా 5607 మంది పాసయ్యారు. ఒకేషనల్‌ మొదటి సంవత్సరంలో 991 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 702 మంది పాసయ్యారు. ద్వితీయ సంవ త్సరంలో 895 మంది పరీక్ష రాయగా 702 మంది పాసయ్యారు. అయితే హై స్కూల్‌ ప్లస్‌ జూనియర్‌ కళాశాలలో మాత్రం ఉత్తీర్ణత శాతం చాలా దారుణంగా పడిపో యింది. రాజం పేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుండి నాగ జోష్ణ 470కి 463, వైష్ణవి 500కు 472, మోనిష్‌ 470కి 462, బి.కొత్తకోట కళాశాల నుండి హర్షవర్ధన్‌ 440కి 424, సాయి కీర్తన 1000కి 957, గుర్రంకొండ ప్రభుత్వ జూనియర్‌ కళా శాల నుండి నబీద 1000కి 970, మదనపల్లె ప్రభుత్వ బాలికల కళాశాల నుండి ఎబి ఇక్రామ 1000కి 959, ఫిర్‌ దోస్‌కు 1000కి 982, చొప్పున మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాలల ప్రతిష్టను మరింత పెంచారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను, ఉత్తమ ఫలితాలు వచ్చేందుకు కషి చేసిన ఆధ్యాపకులను ఇంటర్మీడియట్‌ విద్యా జిల్లా అధికారి కృష్ణయ్య అభినందించారు.

➡️