ఫొటో : అధికారులతో మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ కాకర్ల సురేష్
ఉదయగిరికి ప్రాధాన్యత కల్పించండి
– ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ అధికారులతో ఎంఎల్‌ఎ కాకర్ల సమీక్ష
ప్రజాశక్తి -వరికుంటపాడు : ఉదయగిరి నియోజకవర్గానికి మొదటి ప్రాధాన్యతినిస్తూ 143 పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి లేకుండా పని చేయాలని ఎంఎల్‌ఎ కాకర్ల సురేష్ ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ అధికారులకు దిశానిర్థేశం చేశారు. సోమవారం నెల్లూరులోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యుఎస్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జలసిరి ఎన్‌టిఆర్ సృజల స్రవంతి పథకాల గురించి వివరాలు సేకరించారు. అనంతరం ఎంఎల్‌ఎ కాకర్ల సురేష్ మాట్లాడుతూ జలసిరి ద్వారా నియోజకవర్గంలో రైతులకు అత్యధిక బోర్లు వేసేలా ప్రణాళిక చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఎన్‌టిఆర్ సృజల స్రవంతి ద్వారా అవసరమైన పంచాయతీల్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. క్లోరిన్ రహిత నియోజకవర్గంగా ఉదయగిరిని రూపుదిద్దేలా కృషి చేయాలని తెలిపారు. మూగజీవాల కోసం అవసరమైన చోట్ల బోర్లు వేసి చేతిపంపులు అమర్చాలన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో మంజూరై అసంతృప్తిగా మిగిలిపోయి ఉన్న 8 మండలాల్లో ఉన్న మదర్ ప్లాంట్ల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. తదితర అంశాలపై ఎంఎల్‌ఎ కాకర్ల సురేష్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యుఎస్ ఇఇ రాధయ్య, వింజమూరు డిఇఇ బి.భావనారాయణ, కలిగిరి ఎఇఇ ఎస్.కె మషోద్ అహ్మద్, జలదంకి ఎఇఇ ఎ.సతీష్ బాబు, కొండాపురం ఎఇఇ ఎస్.కె.జిలాని భాషా, దుత్తలూరు ఎఇఇ టి.హరిత, వింజమూర్ ఎఇ కె.వరప్రసాద్, వరికుంటపాడు ఎఇ ఆర్ హనీనిశి, ఎస్‌ఆర్‌పురం ఎఇ పి.జగన్నాథం తదితరులున్నారు.