సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు, కమిషనర్
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1534.27 కోట్ల అంచనాలతో బడ్జెట్‌కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రారంభ నిల్వ రూ.670.23 కోట్లుగా కాగా, మరో రూ.860.04 కోట్ల ఆదాయ అంచనాలతో బడ్జెట్‌ను ఆమోదించారు. మేయర్ రాజీనామా ప్రకటించిన నేపథ్యంలో తాత్కాలిక అధ్యక్షులుగా స్టాండింగ్ కమిటీ సభ్యులు కొమ్మినేని కోటేశ్వరరావును ఎన్నుకొని సమావేశం నిర్వహించారు. గుంటూరు నగరంలో వార్డుల వారీగా సమగ్రాభివృద్ధికి దోహదపడేలా, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా సుమారు 361 పనులకు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఆమోదించినట్లు కోటేశ్వరరావు తెలిపారు. సమావేశంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, స్టాండింగ్ కమిటి సభ్యులు ఈరంటి వరప్రసాద్, షేక్ మీరావలి, దాసరి లక్ష్మీదుర్గ, ముప్పవరపు భారతి, నూకవరపు బాలాజీ, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటి కమిషనర్లు పాల్గొన్నారు.
