పంచాయతీల అభివృద్ధికి లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి

ప్రజాశక్తి-టంగుటూరు: గ్రామ పంచాయతీల సుస్థిర అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ లక్ష్యాలను ఏర్పరచుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఐఆర్డీ) జాయింట్‌ డైరెక్టర్‌ కేశవరెడ్డి అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. పంచాయతీల అభివృద్ధి లక్ష్యాలు, ఆశయాలపై టంగుటూరు ఎంపీడీవో కార్యాల యంలో మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచా యతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందికి రెండు రోజులుగా ప్రత్యేక శిక్షణా తరగతులను అధికారులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం శిక్షణా తరగతులను ఏపీ ఎస్‌ఐఆర్డీ జాయింట్‌ డైరెక్టర్‌ కేశవరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణా కార్యక్రమంలో పాల్గొని గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నీటి సరఫరా, మహిళలు, పంచాయతీల అభివృద్ధి, పారిశుధ్యం వంటి 9 రకాల కార్యక్రమాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైనింగ్‌ మేనేజర్‌ అమ రాబాబు, పీడబ్ల్యూఎస్‌ ఐఈసీ ఖాజావలి, ఎంపీడీవో దేవసేన కుమారి, అధికారులు పాల్గొన్నారు.

➡️