ప్రజాశక్తి – కడప ప్రతినిధి ఉమ్మడి జిల్లాలోని బుడ్డశనగ, కందులు, పెసర, నువ్వుల దిగుబడులు గణనీయంగా తగ్గాయని, ఇటువంటి పరిస్థితుల్లో బుడ్డశనగను రూ.5,650 ధరను నిర్ణయించడం దారుణమని కడప ఎంపీ వై.ఎస్ అవినాష్‌రెడ్డి వాపోయారు. శనివారం జిల్లా పరిషత్ ఛైర్మన్ జేష్యాధి శారద అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు గైర్హాజరైన నేపథ్యంలో కడప ఎంపీ దగ్గర నుంచి జడ్‌పిటిసిల వరకు బయటికి వెళ్లి ఛైర్మన్ ఛాంబర్‌లో నిరీక్షించారు. జడ్‌పి సిఇఒ కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను ఫోన్‌లో సంప్రదించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ హాజరు కావడంతో సమావేశం ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ సమీక్షలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం బుడ్డశనగ విత్తన ధర రూ.7,350 విక్రయించిందని, కొనుగోలు దగ్గరికి వచ్చే సరికి క్వింటాల్ రూ.5,650 ప్రకటించడం ఏమిటని నిలదీశారు. బుడ్డశనగ దిగుబడులు తగ్గిన నేపథ్యంలో ధరను తగ్గించడం దారుణమని, రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారాన్ని భరించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 25 శాతం క్రాఫ్ కటింగ్ చేసిన నేపథ్యంలో క్రాఫ్ కటింగ్ ఎప్పుడు చేస్తారని నిలదీశారు. రాష్ట్రప్రభుత్వం క్రాప్ కటింగ్ చేసేసరికి 50 శాతానికిపైగా రైతులు నూర్పిడి చేసుకుని దళారులకు విక్రయించేస్తారని, అప్పుడు రైతులకు బదులు దళారులు లబ్ధి పొందుతారని ఆందోళన వ్యక్తం చేశారు. చక్రాయపేట మండలం కె.రాజుపల్లి తాగునీటి స్కీమ్ చాలా అధ్వానంగా పని చేస్తోందని, 67 గ్రామాలకు 15 గ్రామాలకు సైతం తాగునీటిని సరఫరా చేయడం లేదన్నారు. అనంతరం కడప, అన్నమయ్య జెడిఎలు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో రూ.7850 లతో కందు లను కొనుగోలు చేస్తామన్నారు. డ్రోన్ టెక్నాలజీ ఆధారంగా పురుగు మందులను పిచికారీ చేయడం ద్వారా వృథాను అరికట్టవచ్చని తెలిపారు. ఎన్‌పి ఎస్‌ఎస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా పంటలకు సోకిన తెగుళ్లను తక్షణమే గుర్తించడం సులభంగా మారిందన్నారు. బి.మఠం ఎంపిపి వీరనారాయణరెడ్డి మాట్లాడుతూ బి.మఠం మండలంలో నకిలీ వరి విత్తనాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, నకిలీ విక్రేతలపై కేసులు నమోదు చేయడం ద్వారా నకిలీల బెడదను అధిగమించాలని సూచించారు. దీనికి డిఎఒ స్పందించి నకిలీ విత్తన విక్రేతలపై కేసు నమోదు చేయడంతోపాటు పరిహారం వసూలు చేసే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్‌సుధ మాట్లాడుతూ పోరుమామిళ్ల ప్రభుత్వాస్పత్రి వైద్యులను డిప్యూటేషన్ వేయడం దారుణమని, రోజుకు 300 మంది రోగులు ఆస్పత్రికి వస్తుంటారని, అటువంటి ప్రాంతం నుంచి పెన్షన్ల రీఅసెస్మెంట్‌కు వేయడం ఏమిటని ప్రశ్నించారు. బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండల పరిధిలోని కుంభగిరి కాలనీలోని పక్కాగృహాలు చిన్నపాటి వర్షానికే ఉరుస్తున్నాయని, వాటి మరమ్మతు నిధులను పెంచడమా, కొత్తగా పక్కాగృహాలను కేటాయించడమా అనేది ఆలోచించాలని డిమాండ్ చేశారు. కమలాపురం సిహెచ్‌సిలో సర్జన్, గైనకాలజిస్టులు లేకపోవడంతో మహిళలు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చింతకొమ్మదిన్నె జడ్‌పిటిసి నరేన్ రామాంజులరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. జిజిహెచ్ కేన్సర్‌కేర్‌లో స్పెషలిస్టుల కొరత కారణంగా నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదన్నారు. ప్రొద్దుటూరు జిజిహెచ్‌లోఎంఆర్‌ఐ సేవలు చాలా అధ్వానంగా ఉన్నాయని, రోజుల తరబడి తిప్పుకుంటున్నారని, ప్రజాప్రతినిధులు అనే గౌరవం కూడా లేదని, అటువంటి అధికారిపై చర్యలు తీసుకో వాలని యర్రగుంట్ల జడ్‌పిటిసి డిమాండ్ చేశారు. దీనికి జెసి స్పందించి విచారించి చర్యలు తీసుకు ంటామని హామీ నిచ్చారు. పిహెచ్‌సి కేంద్రాల్లో మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన సమీక్షా సమావేశాలు నిర్వహించడం లేదన్నారు. అనంతరం చక్రాయపేట మం డలంలోని 22 మంది ఫీల్డ్ అసిస్టెంట్లలో 15 మందిని తొలగించడం ఏమిటని నిలదీశారు. దీనికి డ్వామా పీడీ స్పందించి చిన్నపాటి లోపాలు ఉంటే హెచ్చరిస్తామని, ఆర్థిక పరమైన తప్పిదాలు ఉంటే తొలగిస్తున్నామని తెలిపారు. అనంతరం చింతకొమ్మదిన్నె జడ్‌పిటిసి నరేన్‌రామాంజులరెడ్డి, వైస్ ఛైర్మన్ బాలయ్యయాదవ్, వీరపునాయు నిపల్లి జడ్‌పిటిసిమాట్లాడుతూ జిల్లాలో తొమ్మిది గంటలు కరెంటు ఇస్తున్నారా, ఏడు గంటలు ఇస్తున్నారనే అంశంగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి ట్రాన్స్‌కో ఎస్‌ఇ స్పందించి సిఎండి ఆదే శాల మేరకు తొమ్మిది గంటలపాటు ఇస్తున్నామని వివరించారు. జిల్లావ్యాప్తంగా ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్లు, మెటీరియల్ కొరత వేధి స్తుండడంపై ఎంపీతోపాటు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో చింతకొమ్మదిన్నె, జమ్మల మడుగు, రైల్వేకోడూరు, లక్కిరెడ్డిపల్లి ప్రాంతాల్లో అన్‌కనెక్టెడ్ బ్లాగ్స్ ఉన్నాయని, వాటిని కలుపుతూ పిఎంజిఎస్‌ఐ-4 కింద రహదారి నిర్మా ణాలు చేపట్టాల్సి ఉందన్నారు. గ్రామీణ జనాభా 500 మించిన గ్రామాలను పరిగణలోకి తీసుకోవాల్సిన నేపథ్యంలో ఎక్కువ రహదా రుల నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. దీనికి ఎంపీ స్పందించి 250 గ్రామీణ జనాభాను ఆధారంగా తీసుకోవాలని తీర్మా నం చేద్దామని ప్రతిపాదించారు. దీంతో జిల్లావ్యాప్తంగా పలు గ్రా మాల్లో రహదారులు నిర్మించే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. అనంతరం ఎంఎల్‌సి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 30 సిబిఎస్‌ఇ సిలబస్ పాఠశాలల విద్యార్థులను స్టేట్ సిలబస్‌లో పరీక్షలు నిర్వహించడం ఏమిటని, ఇంగ్లీష్ మీడియాన్ని ఎత్తేయాలను కుంటోందా అని ప్రశ్నించారు. సమావేశం ముగింపు నేపథ్యంలో జడ్పీ సిఇఓ స్పందిస్తూ జిల్లాలో అక్రమ మైనింగ్ నివారించాలని, పిఎంజిఎస్‌వై-4 స్కీమ్‌ను 250 గ్రామాలకు వర్తింపజేసేలా తీర్మా నాలను ఆమోదించినట్లు ప్రకటించారు. సమావేశానికి కూటమి తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం గమనార్హం. సమా వేశంలో జెసితోపాటు సిఇఓ, డిప్యూటీ సిఇఓ, ఉమ్మడి జిల్లాకు చెందిన జడ్పీటిసిలు, ఎంపిపిలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
