వెయిట్‌ లిఫ్టింగ్‌లో పల్లవికి బంగారు పతకం

Dec 10,2024 22:13

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ఆంధ్ర విశ్వ కలాపరిషత్‌ తరపున గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో జరిగిన సౌత్‌ వెస్ట్‌ జోన్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో సత్య డిగ్రీ కళాశాల విద్యార్థి పల్లవి బంగారు పతకం సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఎస్‌.పల్లవి 71 కేజీల విభాగంలో 90కేజీల స్నాచ్‌, 117 కేజీల క్లీన్‌ అండ్‌ జెర్క్‌ మొత్తం 202 కేజీల బరువును ఎత్తి బంగారు పతకం సాధించింది. పల్లవి తో పాటు మరో ముగ్గురు విద్యార్థులు అంతర్‌ యూనివర్శిటీ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవి సాయి దేవ మణి తెలిపారు. ఎ.యశశ్రీ, బి.నీరజ (మొదటి సంవత్సరం), ఎస్‌.పల్లవి, ఆర్‌.రాంబాబు (సెకెండ్‌ ఇయర్‌) జనవరిలో హిమాచల్‌ ప్రదేశ్‌ లో జరిగే అంతర్‌ యూనివర్శిటీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వీరిని కళాశాల సంచాలకులు డాక్టర్‌ ఎం శశి భూషణ రావు అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

➡️