గొల్లపల్లి పాఠశాల 10 వ తరగతి విద్యార్థులకు విద్యాసామగ్రి వితరణ

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ (తిరుపతి) : రూరల్‌ మండలం గొల్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు మహాసభ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భారతి అధ్యక్షతన బుధవారం ఘనంగా జరిగింది. పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు బాగా రాయాలనే ఉద్దేశంతో గొల్లపల్లి పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయులు ఎన్‌.శ్రీరాములు. 10 వ తరగతి విద్యార్థులకు ప్యాడ్‌ పెన్నులు స్కేల్స్‌ పెన్సిల్స్‌ జామెంట్రీ బాక్సులు మొదలైన విద్యాసామగ్రిని అందించడం జరిగింది .10 వ తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి ప్రతిభ చూపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు భారతి మేడం కూడా విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధించాలని కోరుకున్నారు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. .

➡️