రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలలో బంగారు పతకం సాధించిన గొల్లపల్లి విద్యార్థిని లోకేశ్వరి

Nov 28,2024 15:50 #Tirupati

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్  (తిరుపతి) : గొల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పి. లో కేశ్వరి అండర్-14 బేస్ బాల్ పోటీలలో బంగారు పతకం సాధించారు. ఈ నెల 24, 25, 26 వ తేదిలలో తిరుపతి జిల్లా మంగళం ట్రేడ్స్ నందు జరిగిన అండర్-14 బేస్ బాల్ అంతర్ జిల్లాల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, బంగారు పతకం సాధించినందుకు పాఠశాల ప్రధానో పాధ్యాయులు రమేష్ సంతోషం వ్యక్తం చేశారు.  విద్యర్థినిని అభినందించారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాఠశాల పి డి. గోపికృష్ణ ఉపాధ్యాయులు  ఎస్. ఎస్ నాయుడు, ఎ. నరసింహులు, చంద్రశేఖర్ శ్రీరాములు ,ఏకాంబరరెడ్డి, హేమావతి, ప్రభావతి, గీత పాల్గొన్నారు.

➡️