భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ‌

Apr 18,2025 17:29 #Konaseema

ప్రజాశక్తి – కపిలేశ్వరపురం : కపిలేశ్వరపురం మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కపిలేశ్వరపురం, మాచర, టేకి, వెదురుమూడి, కోరుమిల్లి, అంగర, తాతపూడి, తదితర గ్రామాల్లో క్రైస్తవ సోదరులు చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో క్రైస్తవ సోదరులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన క్రైస్తవ ఆరాధకులు, అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

➡️