వైసిపికి మేయర్‌ దంపతులు గుడ్‌ బై..

Jun 10,2024 20:42
వైసిపికి మేయర్‌ దంపతులు గుడ్‌ బై..

మాట్లాడుతున్న మేయర్‌ స్రవంతి
వైసిపికి మేయర్‌ దంపతులు గుడ్‌ బై..
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:అధికారపార్టీ ఒత్తిళ్లకు తట్టుకోలేక రూరల్‌ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌ అన్న వెంట నడవలేకపోయామని, ఎన్నో అవమానాలు భరించామని, వ్యక్తిగతంగా ఆయనను విమర్శించామని ఆయనతోనే నడిచేందుకు వైసీపీకి రాజీనామా చేస్తున్నామని మేయర్‌ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్‌ పేర్కొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలోని తన ఛాంబర్‌ లో సోమవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార వైసీపీని శ్రీధర్‌ రెడ్డి అన్న వీడినప్పుడు తాము కూడా ఆయన వెంటే నడిచేందుకు సిద్ధమై మేయర్‌ పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డామన్నారు. అధికార పార్టీ నేతలు తమను తిరిగి వైసీపీలోకి రావాలని బెదిరించి, తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. వైసీపీలోకి రాకపోతే మేయర్‌ పదవి నుండి తొలగిస్తామని బెదిరించారన్నారు. విధిలేని పరిస్థితుల్లో వైసీపీలోకి తిరిగి వెళ్లామన్నారు. ప్రజల మనిషి అయిన కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని రూరల్‌ నియోజకవర్గ ప్రజలు ఆదరించారన్నారు. శ్రీధర్‌ రెడ్డి అన్న తమను క్షమించి అక్కున చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీధర్‌ రెడ్డి పై విమర్శలు చేయాలని వైసిపి నేతలు తమపై ఒత్తిడి తెచ్చారని అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. రాజకీయ బిక్ష పెట్టిన శ్రీధర్‌ అన్న పై తమకు గౌరవంతో పాటు భక్తి కూడా ఉందన్నారు. పొరపాటు జరిగి ఉంటే క్షమించాలని వేడుకున్నారు.

➡️