దాచేపల్లి (పల్నాడు) : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనివాసపురం వద్ద మంగళవారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో గుంటూరు- హైదరాబాద్ మధ్య నడవాల్సిన రైళ్ళ ను అధికారులు విజయవాడ మీదుగా దారి మళ్లించారు. విష్ణుపురం రాశి సిమెంట్ ఫ్యాక్టరీకి లోడింగ్ కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రైల్వే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు.