రామోజీకి గోపాలపట్నం సేవా పీఠం నివాళి

Jun 11,2024 23:51 #Ramoji nivali
Ramoji,

 ప్రజాశక్తి -గోపాలపట్నం : తెలుగువారి ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తులలో రామోజీరావు ముందు వరుసలో ఉంటారని గోపాలపట్నం సేవా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు నందవరపు సోములు అన్నారు. గోపాలపట్నంలోని సేవా పీఠం కార్యాలయంలో రామోజీరావు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సోములు మాట్లాడుతూ, రామోజీ ఒక మహా సాగరమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గోరకల రామదాసు, మాజీ అధ్యక్షులు చందు సుబ్బారావు, మాజీ ఉపాధ్యక్షులు కొంతం నూక రాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు గంపల అప్పారావు, కోశాధికారి భాస్కర్‌ పాణిగ్రహి, మాజీ ఉపాధ్యక్షులు మిద్దప్పరావు, సలహాదారులు రమణారావు, అందిపోయిన శ్రీనివాస్‌, తాండ్రంగి రామారావు, బల్ల రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️