- పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్
ప్రజాశక్తి – చీరాల : చీరాలలోని ఎల్‌బిఎస్ నగర్‌లో డాక్టర్ గోరంట్ల రాజేష్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మెరుగైన వైద్యం అందించాలని రాజేష్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యలు, టిడిపి నాయకులు, పులువురు ప్రముఖులు పాల్గొన్నారు.