ప్రజాశక్తి-దర్శి: దర్శి నియోజకవర్గం తూర్పుగంగవరంలో సోమా ఆంజనేయులు పదవీ విరమణ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ పోలీసు ఉద్యోగంలో పని చేసి అనేక ఆటు-పోట్లు ఎదుర్కొని నేడు ఉద్యోగ విరమణ చేయడం గర్వకారణం. తన ఉద్యోగ బాధ్యతలో అటు ప్రజలను తనపై అధికారులను మన్ననల్ని పొందుతూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఆయన ఉద్యోగ జీవితంలో ఎంతోమందికి సేవ చేసి ఉంటారు. ఆయన సేవలు రాబోయే తరానికి ఆదర్శప్రాయంగా నిలవాలన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ప్రజల కోసం తన సేవలో వినియోగించాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రజా ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములై ప్రజలకు సేవ చేయాలని కోరారు. మీకు భవిష్యత్తులో ఆయురారోగ్యాలు దేవుడు మరింతగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మరిల్లురెడ్డి, జిల్లా నాయకులు కొండారెడ్డి, మండల నాయకులు బడే వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
