ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ

ప్రజాశక్తి కొమరోలు : ఎస్‌ఎఫ్‌ఐ గిద్దలూరు ఏరియా కమిటీ సమావేశం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ గిద్దలూరు ఏరియా కమిటీ అధ్యక్షుడు డి. తేజ మాట్లాడుతూ నల్లగుంట్ల గ్రామంలో బ్రిటిష్‌ కాలం నుంచి ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాలు లేని కారణంగా పాఠశాల పరిస్థితి అధ్వానంగా తయారైనట్లు తెలిపారు. భవనాలు సైతం శిథిలావస్థకు చేరినట్లు తెలిపారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో పిల్లలు బడికి వెళ్లడం లేదన్నారు. కొంతమంది కొమరోలు, మరి కొంతమంది తాడిచెర్ల మోటు వెళ్లి చదువుకుంటున్నట్లు తెలిపారు. కొంత మంది ప్రైవేటు స్కూళ్లకు అధిక ఫీజులు చెల్లించి తమ పిల్లలను చదివించు కుంటున్నారన్నారు. నల్లగుంట్ల గ్రామంలో 500 కుటుంబాలు ఉన్నట్లు తెలిపారు. వారంతా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే స్థోమత ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. గ్రామస్తుల సౌకర్యార్ధం ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అరుణ్‌ ,శశి, సుభాష్‌,శ్రీను,సాయి ,విష్ణు తదితరులు పాల్గొన్నారు.

➡️