అంబాపురం విజయవాడ రూరల్ (ఎన్టీఆర్ జిల్లా) : అంబాపురం గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తూ తీవ్రంగా గాయపడిన కార్మికుడిని ప్రభుత్వం ఆదుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది. కార్మికుడిని సిఐటియు నాయకులు సోమవారం పరామర్శించారు. అంబాపురం పంచాయతీలో కొక్కిలగడ్డ.చంద్రశేఖర్ అనే కార్మికుడికి విధులు నిర్వహించే క్రమంలో ప్రమాదం జరిగింది. అతనికి ఆరోగ్యశ్రీ ద్వారా విజయవాడ స్వర హాస్పిటల్ వద్ద తుంటికి బాల్ వేశారు. సిఐటియు నాయకులు ఆ కార్మికుడిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం.సోమేశ్వరరావు, సిఐటియు విజయవాడ రూరల్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
