ప్రజాశక్తి – రేపల్లె: కూటమి ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తుందని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు రాసంశెట్టి మహేష్ తెలి పారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజక వర్గంలోని నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి ప్రాంతాలలో పర్యటించిన వైసిపి మాజీ మంత్రి మేరుగ నాగార్జున కూ టమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిం చారు. అసత్యాలు, అబద్ధాలను పునాదులుగా చేసుకొని వైసీపీ నాయకులు గత ఐదు సంవత్సరాలు వ్యవస్థలను బ్రష్టు పట్టించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూట కటకుని అధికారం కోల్పోయినా.. వారి తీరు మారకపోవడం విచార కరం అన్నారు. అధికారంలో ఉన్నంతకాలం కన్ను మిన్ను కానకుండా ఇష్టాను సారంగా వ్యవహరించిన అప్పటి వైసిపి పాలకులకు, కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మేం దుకు రైతు పరామర్శల పేరుతో పంట పొలాలను పరామర్శించడం సిగ్గుచేటు అన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలకు ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా అమ్మఒడి ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోక వచ్చి ఆరు నెలలకే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా పేరుతో రూ.13500 ఇవ్వగా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో జనవరి నెల నుండి రైతు ఖాతాలలో రూ.20 వేల రూపాయలు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన వెంటనే 24 గంటలు గడవక ముందే వారి అకౌంట్లో డబ్బులు పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైసిపి పాలనలో దాన్యం అమ్మిన తర్వాత ఎప్పుడు డబ్బులు పడతాయో కూడా తెలియని విపత్కర పరిస్థితులు రైతులు ఎదుర్కొన్నా విషయాన్ని మాజీ మంత్రి మెరుగు నాగార్జున గుర్తించుకోవాలని తెలిపారు. ప్రజా క్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ అడుగడుగునా ప్రజలకు అండగా ఉంటూ ముందుకు సాగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక విలువలు వైసీపీ నేతలకు లేవన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.