ప్రజాశక్తి – రేపల్లె : రేపల్లె పట్టణంలోని మౌంట్‌ఫోర్ట్ స్కూల్‌లో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహిం చారు. ఈ వేడుకల్లో యుకెజి విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారులు ప్రత్యేక దుస్తులు (రోబ్స్) ధరించడంతో అందరినీ ఆకట్టుకున్నారు. యుకెజి పూర్తి చేసుకున్న విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ కిరణ కుమార్, వైస్ ప్రిన్సిపల్ చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బ్రదర్ ప్రదీప్ రెడ్డి, ఉపాధ్యాయులు,ల్గొన్నారు.
