కర్నూలు : కర్నూలు నగరంలో గణేష్ నగర్ నందలి ”హారిజాన్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్” నందు ”గ్రాడ్యుయేషన్ డే” వేడుకలు చైర్మన్ ప్రదీప్కుమార్, డైరక్టర్ పావని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చైర్మన్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో చిన్నపిల్లలపై తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. హారిజాన్స్ స్కూల్కు లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారి గుర్తింపుతో ”హారిజాన్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్” గా గుర్తించడం అభినందనీయం అని అన్నారు. డైరెక్టర్ పావని మాట్లాడుతూ నేటి మార్పులకు అనుగుణంగా నూతన విద్యావిధానంలో సమూలమైన మార్పులతో విద్యను అందించడం సంతోష దాయకం అన్నారు. గ్రాడ్యుయేషన్ డే దుస్తులతో విద్యార్థులు నిర్వహించిన వేడుకలను విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై చక్కని అనుభూతిని పొందారు. తమ కార్యక్రమములకు సహకరిస్తున్న అధ్యాపకులకు, తల్లిదండ్రులకు డైరక్టర్ పావని, చైర్మన్ ప్రదీప్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
