సిద్ధార్థలో ఘనంగా గ్రాడ్యుయేషన్‌ డే

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రంలోని శ్రీసిద్ధార్థ పాఠశాలలో గ్రాడ్యుయేషన్‌ డేను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్‌ కె.ముల్లారావు మాట్లాడుతూ ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులను తదుపరి తరగతికి ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగా వారికి పట్టాల ప్రదానం చేసి ఆ విద్యార్థిని విద్యార్థులను సత్కరించడం జరిగిందన్నారు. ఈ విధంగా విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని చిన్ననాటి నుంచి పెంపొందింప చేయడానికి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని పాఠశాల అధినేత ముల్లారావు పేర్కొన్నారు. అలాగే విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసి వారి భవిష్యత్తుకు ఉపాధ్యాయులు బాటలు వేయాలని ఆకాంక్షిస్తూ, పట్టాలు పొందిన విద్యార్థులను డైరెక్టర్‌ ముల్లారావు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ, హైస్కూల్‌ ప్రిన్సిపల్స్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️