- రోడ్లు వేయలేదని సభలో పలువురు నిలదీత
- వైస్ ఎంపిపి ప్రోటోకాల్ వివాదం
ప్రజాశక్తి-పరవాడ (అనకాపల్లి జిల్లా) : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రావాడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మోటూరి సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళలర్పించి సర్చంచ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో పరవాడ ఎంపీడీవో ధర్మరావు పాల్గన్నారు. ఈ 3నెలల కాలవ్యవధిలో జరిగిన అభివఅద్ది పనులు, పంచాయతీ సిబ్బంది జీతభత్యాలు చెల్లింపులు, నిర్వాహణ ఖర్చులకు సంబంధించిన వివరాలను పంచాయతీ కార్యదర్శి అనురాధ సభలో చదివి వినిపించారు. గ్రామ పంచాయతీలో సాధరణ నిధులు సుమారుగా 70లక్షలు రూపాయలు, ఇతర నిధులు రూ.20లక్షలు నిల్వలు ఉన్నట్లు, ఎన్‌టిపిసి నుండి సుమారుగా 1కోటి 10లక్షల రూపాయలు రానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ అభివఅద్ధి, గ్రామాల్లో చేపట్టవలసిన పనుల రూపకల్పన, ప్రణాళికలు తదితర అంశాలపై సభలో వివరించారు. గతంలో చేసిన ప్రణాళికలు, మంజూరు అయిన రోడ్లు ఎందుకువేయలేదని పలువురు ప్రశ్నించారు. దీనికి సర్పంచ్ మోటూరు సన్యాసినాయుడు సమాధానం ఇస్తూ కాంట్రాక్టర్లుకు మార్చి చివరి దశలో టెక్నికల్ సమస్యవలన వారు చేసిన పనులకు బిల్లురాకపోవడంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేయడానికి ముందుకు రావడం లేదని తెలిపారు. పరిపాలన అనుమతులు ఉన్న అన్నీ అభివఅద్ధి పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, టిడిపి మండలపార్టీ అధ్యక్షులు వియ్యపు చిన్న, వైసిపి మండల పార్టీ అధ్యక్షులు కోనరామారావు, మాజీ వార్డు మెంబర్లు, సచివాలయం సిబ్బంది, పంచాయతీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రోటోకాల్ వివాదం ….
ఎంపిడిఓ ధర్మారావు పాల్గొన్న కొద్దిసేపటికే ఇంజనీర్ అసిస్టెంట్ శిరిషా మాట్లాడుతున్న సమయంలో వైస్.ఎంపిపి పేరు ప్రస్తావించకపోవడంతో అక్కడే ఉన్న వైస్‌ఎంపిపి బంధంనాగేశ్వరరావు సభ జరుగుతుండగా అక్కడినుండి వెళ్లిపోయారు. ఆయనతో పాటు వైసిపి నాయకులు వెళ్లిపోయారు. దీనిపై వైస్.ఎంపిపిను వివరణ కోరగా సభ జరిగిన దగ్గర నుండి అధికారులు ప్రోటోకాల్ పాటించనందున సభ నుండి వెళ్లిపోయినట్లు ఆయన ప్రజాశక్తి తెలిపారు.