గ్రామసభలే గ్రామ అభివృద్ధికి తొలిమెట్టు

Nov 13,2024 16:57 #Tirupati

జిపిడిపి ప్రణాళిక ద్వారా ఇది సాధ్యం -ఎంపీడీవో

ప్రజాశక్తి – పెళ్లకూరు : పెళ్లకూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయం నందు బుధవారం గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక విధివిధానాలపై సమావేశం నిర్వహించడం జరిగినది, మండల ఎంపీపీ పోలంరెడ్డి.శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మండల ఎంపీడీవో ప్రమీల రాణి మాట్లాడుతూ .. ప్రస్తుతం గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ సభలు నిర్వహించి గ్రామంలో అవసరమైన పనులు గుర్తించాలని సూచించారు. గతంలో ఈ విధానం లేనందువల్ల స్వాతంత్రం వచ్చినప్పటికీ, మనది ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ ఉన్నత వర్గాల చేతిలోనే పెత్తనం ఉంటూ వచ్చిందని, మనకు తగిన టెక్నాలజీ లేనందువల్ల ప్రభుత్వ అధికారుల నుంచి మనలను పాలించే పాలకులు వరకు ఏం చేస్తున్నారో, ఏ నిధులు ఎలా ఖర్చవుతున్నాయో మనకు తెలిసేది కాదు. కానీ 2018 ఆన్లైన్ విధానం వచ్చిన తరువాత అనేక మార్పులతో ప్రస్తుతం గ్రామాలకు సంబంధించిన నిధులు ఎంత వస్తున్నాయి? దేనికి ఖర్చు పెడుతున్నారు ఎంత నిలవ ఉంది ఇలా ప్రతి విషయాన్ని సామాన్య పౌరుడు దగ్గర నుంచి మన రాష్ట్ర పాలకుల వరకు ఎవరైనా ఎప్పుడైనా చూసుకునే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. మనలో ప్రతి ఒక్కరు ఈ అభివృద్ధిలో భాగం కావాలంటే..  ప్రతి పిల్లవాణ్ణి మంచి విద్యను అందించే విధంగా అందులోనే మానసిక వికాసం శారీరిక దారుఢ్యం ఉండి మంచి పౌరులుగా విలువలతో కూడిన విద్య కావాలి అందుకు తోడ్పడే విధంగా మన గ్రామ పాఠశాల వాతావరణాన్ని కల్పించాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది అని ఆయన అన్నారు.

➡️