ఉపాధి హామీ పనులు గుర్తించడానికి గ్రామ సభలు

Oct 2,2024 16:26 #Gram Sabhas, #workers

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి 2025- 26 సంవత్సరానికి పనులు గుర్తింపు కొరకు ప్రారంభ గ్రామసభ లను బుధవారం నిర్వహించడం అయినది. ఈ గ్రామసభలో ఉపాధి హామీ పధకం లో చేసే వివిధ రకాల పనుల గురించి వివరించడమైనది. ఈ గ్రామ సభలలో సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, గ్రామ ప్రజలు పాల్గన్నారు. బుధవారం కొన్ని గ్రామాలు, గురువారం రోజున కొన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది అని ఎంపీడీవో యోగానంద రెడ్డి తెలిపారు.

➡️