ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి సీతారామరాజు) : రాజవొమ్మంగి మండలంలో దసరా వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. దేవీ నవరాత్రులు ముగియడంతో శనివారం రాజవొమ్మంగి, దూసరపాము, జడ్డంగి, లాగరాయి, లబ్బర్తి, తదితర గ్రామాల్లో దుర్గాదేవి ఆలయాల వద్ద ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా పండుగ నేపథ్యంలో భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఆయా ఆలయాల వద్ద ఆలయ కమిటీలు భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.