ఘనంగా సంక్రాంతి సంబరాలు

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలు, రంగవల్లులతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముగ్గులు వేసిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. ఈసందర్భముగా కళాశాల ప్రిన్సిపాల్‌ సాయిబాబు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను ఎప్పటికి మరువరాదని, భారతదేసదం అన్ని దేశాల సంప్రదాయాలకు మూలమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ పద్మనాభం, నల్లి రాజు,శైలజ, పుల్లయ్యనాయుడు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

➡️