చింతలపూడి (ఏలూరు) : చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం స్కూల్ లో సంక్రాతి సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, గాలిపటాలతో కోలాహలంగా పండుగ చేసుకున్నారు. అరిసెలు, పిండి వంటలను విద్యార్థులకు అందజేశారు. హరిదాసుని వేషం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్బంగా ఏపీ ఆర్ గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ బ్రాహ్మణశ్వరి మాట్లాడుతూ … సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఉద్దేశంతో కళాశాలలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు మన సంప్రదాయలు తెలుసుకోవాలని కోరారు.