పెద్దమ్మ కొడుకులే హంతకులు – యువకుడు దారుణహత్య

Feb 13,2024 11:40

ప్రజాశక్తి – బ్రహ్మంగారి మఠం (కడప) : బ్రహ్మంగారి మఠం మండలం మల్లెగుడిపాడు గ్రామానికి చెందిన యువకుడు దారుణహత్యకు గురైన ఘటన మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు కథనం మేరకు … మల్లెగుడిపాడు గ్రామానికి చెందిన కుంచాల రాంమోహన్‌ రెడ్డి (28) రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. అతడి ఆచూకీ కోసం బంధువులు అన్నిచోట్ల వెతికారు. తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసి అనుమానిస్తున్న కొందరి పేర్లను తెలిపారు. పోలీసుల దర్యాప్తులో … సొంత పెద్దమ్మ కొడుకులే రాంమోహన్‌ రెడ్డిని హత్య చేసినట్లు నిర్థారణ అయ్యింది. తుమ్మలపల్లె వద్ద రాళ్లతో చంపి ట్రాక్టర్‌ సహాయంతో తీసుకెళ్లి వంకమర్రి వద్ద పూడ్చినట్లు నిందితులు తెలిపారు. మొత్తం ఆరుగురు కలిసి రాంమోహన్‌ రెడ్డిని చంపినట్లు సమాచారం. ఈ హత్య పై పోలీసులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️