గ్రానైట్‌ పాలిషింగ్‌ యానిట్లయజమానులను ఆదుకోవాలి

ప్రజాశక్తి-చీమకుర్తి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్ల యజమానుల సంఘాల సంయుక్త సమావేశంలో కోరారు. రామతీర్థంలోని విటిసి కేంద్రంలో చీమకుర్తి, ఆర్‌ఎల్‌పురం, బూదవాడ, ఏలూరురోడ్డు ఏరియాల్లోని పాలిషింగ్‌ యూనిట్ల యజమానుల సంఘాల సంయుక్త సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి యర్రగుంట్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా పాలిషింగ్‌ యూనిట్ల పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. పరిశ్రమ సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రతి ఆదివారం సెలవు దినం పాటించాలని, వేస్టు మెటీరియల్‌ను ఎడ్జ్‌కటింగ్‌ యూనిట్లకు ఇవ్వకుండా పాలిషింగ్‌ యూనిట్ల వారే ఎవరికి వారే కటింగ్‌ చేసుకోవాలని తీర్మానించారు. మెటీరియల్‌ రేటు పెంచుకునే విధంగా ఈనెల 10,12 తేదీల్లో గ్రానైట్‌ బయ్యర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ప్రభుత్వం ఆదుకోవాలి:కాట్రగడ్డ సంక్షోభం ఎదుర్కొంటున్న పాలిషింగ్‌ పరిశ్రమను ప్రభ ుత్వం ఆదుకోవాలని చీమకుర్తి ఏరియా పాలిషింగ్‌ యూనిట్ల యజమానుల సంఘం అధ్య క్షులు కాట్రగడ్డ రమణయ్య కోరారు. గత ప్రభుత్వం పరిశ్రమను పట్టించుకోలేదన్నారు.విద్యుత్‌ ఛార్జీలు పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు ,మైనింగ్‌ బిల్లులు తగ్గించాలని, విద్యుత్‌ సబ్సీడీలు విడుదల చేయాలని కోరారు. వేలాదిమంది యజ మానులు, కార్మికులు, ఉద్యోగులు ఆధారపడి జీవిస్తున్నారని, ప్రభుత్వం పెద్ద మనస్సుతో ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో చీమకుర్తి ఏరియా యూనిట్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కాట్రగడ్డ రమణయ్య, నూకల సురేంద్ర, గౌరవాధ్యక్షుడు చిన్నపురెడ్డి మస్తాన్‌రెడ్డి, జి.నాగయ్య, జిల్లా ప్రతినిధి కందిమళ్ళ గంగాధరరావు, ఎస్‌కె. అహమ్మద్‌బాషా, ఎస్‌కె. రఫీ,ఎస్‌కె. షరీఫ్‌, ఆర్‌ఎల్‌పురం అసోసియేషన్‌ అధ్యక్షుడు మలినేని వెంకటేశ్వర్లు బూదవాడ ఏరియా అసోసియేషన్‌ అధ్యక్షుడు లగడపాటి శ్రీనివాసరావు, ఏలూరు ఏరియా అసోసియేషన్‌ అధ్యక్షుడు సుబ్బారావు, యూని యన్‌ నాయకులు రావిపాటి రాంబాబు, రాధాకృష్ణ, చలపతిరావు, రాజశేఖర్‌, ఎస్‌కె.అప్‌సాలేహా పాల్గొన్నారు.

➡️