ఘనంగా ఎమ్మెల్యే మాధవి పుట్టిన రోజు వేడుకలు

Feb 15,2025 21:07

 ప్రజాశక్తి-భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ : నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పుట్టినరోజు వేడుకలు భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల మండలాల్లో శనివారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. భోగాపురంలో జనసేన నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు ఆధ్వర్యాన పార్టీ కార్యాలయంలో కేకును కట్‌ చేశారు. రావాడ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు వందనాల రమణ, రావాడ జనసేన నాయకులు కొండపు రాధాకృష్ణారెడ్డి, రావాడ జనసేన నాయకులు సమక్షంలో మెగా ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. హెల్త్‌ క్యాంపులో 225 మందికి వైద్య పరీక్షలు చేయించి ఉచితంగా మందులు అందజేశారు. 25 మంది జనసేన నాయకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు పడాల శ్రీనివాసరావు, మాతా నవీన్‌, లంక సత్యనారాయణ, బొల్లు త్రినాథ్‌ , మైలపల్లి అప్పలకొండ, సీతం నాయుడు , గుండు దిలీప్‌ ,దల్లి శ్రీను, కొండపు రమణ, కొయ్యరాంబాబు తదితరులు పాల్గొన్నారు.

డెంకాడ మండలంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపిపి బంటుపల్లి వెంకట్‌ వాసుదేవరావు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పినతాడివాడకు చెందిన జనసేన సీనియర్‌ నాయకులు మహంతి శివకుమార్‌ గ్రామంలోని రెండు అంగన్‌వాడీ కేంద్రాలకు, ఒమ్మి పేట అంగన్వాడి కేంద్రాల్లో చదువుతున్న పిల్లలకు పదివేలు విలువైన పలకలు, పెన్సిలళ్లు, వాల్‌చార్టులు, భోజనం ప్లేట్లు అందజేశారు. గుణుపూర్‌పేటలో జనసేన మండల కోఆర్డినేటర్‌ పైల శంకర్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి రామాలయంలో పూజలు నిర్వహించారు. జొన్నాడలో జనసేన సీనియర్‌ నాయకుడు దిండి రామారావు ఆధ్వర్యంలో పలువురు వృద్ధులకు, పేదలకు పల్లు, బట్టలు పంపిణీ చేశారు. అక్కివరంలో జనసేన సీనియర్‌ నాయకులు, మాజీ జెడ్‌పిటిసి కంది సూర్యనారాయణ, సర్పంచ్‌ కంది కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

పూసపాటిరేగ: ఎమ్మెల్యే లోకం నాగమాధవి పుట్టిన రోజు సందర్భంగా ప్రజాశక్తి దినపత్రిక ముద్రించిన ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో పూసపాటిరేగ మండల జనసేన నాయకులు పతివాడ శ్రీను, బాలా అప్పలరాజు, కోట్ల రఘు, వందనాల అప్పలరాజు, జలపారి శ్రీనువాసరావు, భోగాపురం నాయకులు అయ్యప్పరెడ్డి, చెల్లుబోయిన నర్సింగరావు, టిడిపి నాయకులు ఇజ్జురౌతు ఈశ్వర్రావు, ప్రజాశక్తి సిబ్బంది పాల్గొన్నారు. కొవ్వాడలో సర్పంచ్‌ కోట్ల రఘు, గోవిందపురంలో బాలా అప్పలరాజు, కందివలసలో నాక్కన రమణ, కోనాడలో ఇజ్జుపు కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మండల జనసేన కోఆర్డినేటర్‌ జమరాజు ఆధ్వర్యంలో కోనాడ జంక్షన్‌లో గల క్యాంపస్‌ చాలెంజ్‌లో మూగ, చెవిటి పిల్లల మద్య కేక్‌ కట్‌ చేశారు.

➡️