ప్రజాశక్తి – ఆలమూరు : సామాన్యులకు అర్థమయ్యే రీతిలో, అచ్చ తెలుగు నుడికారంతో రామాయణాన్ని రచించి ప్రజలకు అందజేసిన కవయిత్రి ‘‘మొల్లమాంబ’’ గొప్ప దార్శనికురాలని మండల శాలివాహన సంఘం అధ్యక్షులు మల్లవరపు మల్లేశ్వరరావు వ్యాఖ్యానించారు. మండల కేంద్రంలో గురువారం మండల శాలివాహన సంఘం ఆద్వర్యంలో మొల్లమాంబ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నియోజవర్గ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటిపల్లి పాపారావు, సొసైటీ మాజీ చైర్మన్ వంటిపల్లి సతీష్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఈదల నల్లబాబు, మాజీ జెడ్పిటిసి రామానుజుల శేషగిరిరావు లతో పాటు పలువురు హాజరై మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయణాన్ని సరళంగా రచించి శ్రీకృష్ణదేవరాయల మన్ననలు పొందిన కవయిత్రి మొల్ల జీవితం అందరికీ ఆదర్శమన్నారు. తెలుగు కవితా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందడంతో పాటు నాటి సమాజంలో నెలకొన్న లింగ, కుల వివక్షతలను బద్దలు కొట్టి చరిత్రలో చిరస్థాయిగా మొల్లమాంబ నిలిచిందని కొనియాడారు. ఈ జయంతి వేడుకల్లో భాగంగా విద్యార్థులకు స్వీట్స్, పెన్నులు, పరీక్షల అట్టలు పంచారు. ఈ కార్యక్రమంలో గంగుల వీరబాబు, కడియాల శ్రీను, ఈదర రాంబాబు, గంగుల రామ్ కుమార్, వై వి వి రమణ, మండల శాలివాహన సంఘ గౌరవ అధ్యక్షుడు పేరూరి త్రిమూర్తులు, జిల్లా సహాయ కార్యదర్శి అంబటి వీరబాబు, పసలపూడి మెహర్, వీరన్న, సత్యనారాయణ, మండ ఫణీంద్ర, పాండ్రాకుల సత్యనారాయణ, నాగసురేష్, గణేష్, అమరనాథ్, మల్లవరపు నాగేశ్వరరావు, ఏడిద సత్యనారాయణ, కాపా శ్రీను, ఏలూరి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
