సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం : విశేష స్పందన

ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : సమాజంలో సగటు మనిషికీ వైద్యం ముఖ్యమైంది అలాంటి వైద్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని భాషే రమ్యం,సేవే గమ్యం అనే నినాదం తో ఉత్తర అమెరికా తెలుగు సంఘం పని చేస్తుందని ప్రజలకు అనేక సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు నూతి బాపయ్య చౌదరి(బాపు) అన్నారు. మంగళవారం కర్నూలు గడియారం ఆసుపత్రి సమీపంలో గల సుర్జీత్ భవన్ నందు సుశీల నేత్రాలయా, మైత్రి హస్పిటల్ సౌజన్యంతో సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సుందరయ్య స్ఫూర్తి కేంద్రం చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కన్వీనర్ జె.ఎన్. శేషయ్య, కార్యదర్శి గౌస్ దేశాయ్, కోశాధికారి కె.వి నారాయణ, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పి. నిర్మల, సుశీల నేత్రాలయ హాస్పిటల్ డాక్టర్ నేహా సుధాకర్, మైత్రి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వినోద్, డాక్టర్ శ్రీకర్, డాక్టర్ శశాంక్, డాక్టర్ సాదియాలతో కలిసి వైద్య శిబిరాన్ని బాపు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షుడు బాపు మాట్లాడుతూ నాట్స్ ఆధ్వర్యంలో చాలా ఉచిత వైద్య శిబిరాలు, మహిళకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు, అమెరికాలో ఉండే ప్రవాస భారతీయులు సేవ కార్యక్రమాలు, గ్రామీణప్రాంతాల్లో రోడ్లు, తాగు నీటి సమస్యలు ఆర్డీటీ వారి ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు ఇలా ఎన్నో సమాజ సేవలో నాట్స్ చేస్తుందన్నారు. ముందు ముందు ప్రజలకు మరింత వైద్య విద్య, మహిళల అభివృద్ధి దిశగా నాట్స్ పని చేస్తుందన్నారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో ఇంత పెద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సుందరయ్య స్ఫూర్తి కేంద్రం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు నాట్స్ తెలుపుతుందన్నారు. సుశీల నేత్రాలయా, మైత్రి హాస్పిటల్స్ ఇలాంటి వైద్య శిబిరాలు మరెన్నో నిర్వహించాలని నాట్స్ సహకారం అందిస్తుందన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ఎముకలు, గర్భిణులు, కళ్ళు, చిన్న పిల్లల సమస్యలు, జనరల్ మెడిసిన్ సమస్యలకు డాక్టర్లు వైద్యాన్ని అందించారు. మెడికల్ రేప్స్ ఆధ్వర్యంలో ఉచిత మందులను వెంకట్, ప్రసాద్ శర్మ , చంద్రశేఖర్, మైత్రి ఆసుపత్రి చీఫ్ ఫార్మసిస్ట్ రజియా, నాట్స్ అధ్యక్షుడు బాపు అందించారు.
దాదాపు 1000 మంది దాకా ఈ శిబిరంలో పలు వైద్య సేవలను పొందారు.పేద ప్రజలు ఉండే ఇలాంటి ప్రాంతాల్లో కనీసం మూడు నెలలకు ఒకసారి వైద్య శిబిరాన్ని అందించాలని ప్రజలు కోరారు. వైద్యాన్ని అందించిన డాక్టర్లకు సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుశీల నేత్రాలయా హాస్పిటల్, మైత్రి హాస్పిటల్ సిబ్బంది, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం వాలింటర్లు రాజశేఖర్, అబ్దుల్ దేశాయ్, విజయ్, కాజా పాషా, మహబూబ్ బాషా,
ఎస్.ఏం.డి షరీఫ్, రషీదా, జయమ్మ, శిరీష తదితరులు పాల్గొన్నారు.

➡️