ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : రాజోలు మండల శివకోటి గ్రామ కార్యదర్శిగా పనిచేసిన బి.కోటయ్య ఇటీవల బదిలీపై వెళ్లినందున శుక్రవారం శివకోటి పంచాయితీ వద్ద సర్పంచ్ గ్రామస్థులు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. శివకోటి గ్రామపంచాయతీ ఆవరణలో ఇక్కడ విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన కొటయ్య కు నూతన వస్త్రాలు బహుకరించి శాలువాతో ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నక్కా రామారావు మాట్లాడుతూ గ్రామానికి పంచాయతీ కార్యదర్శిగా గత రెండున్నర సంవత్సరాలుగా కోటయ్య విధులు నిర్వహించి గ్రామ అభివఅద్ధికి ఎంతగానో కఅషి చేశారని అన్నారు. అలాంటి వ్యక్తి ఇటీవల బదిలీపై వెళ్లడం ఒకపక్క బాధాకరం మరోపక వృత్తి పట్ల బదిలీపై వెళ్లడం సంతోషకరంగా ఉన్నదని అన్నారు. గ్రామాభివఅద్ధికి కఅషి చేసినందుకు గ్రామ ప్రజలు హర్ష వ్యక్తం ప్రకటించారని గ్రామపంచాయతీ సిబ్బంది అతనికి భూకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి, నూతన వస్త్రాలు వారికి బహుకరించి శాలతో ఘనంగా సత్కరించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నక్కారామారావు, ఎంపిటిసిలు సూర్యరావు, బి.కఅష్ణారావు, నాయుకులు కసుకుర్తి త్రినాధ్, చాగంటి స్వామి, పినిశెట్టి బుజ్జి, మెరుగుమువ్వల ప్రసాద్, కడలి నాగేశ్వరరావు, ఆరుమిల్లి బాను, ఇ.బంగారం, మామాజీ పంచాయితీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
