గ్రీన్‌ అంబాసిడర్లకు పెండింగ్‌ వేతనాలివ్వాలి

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ గ్రీన్‌ అంబాసిడర్లకు 15టవ ఆర్థిక సంఘం నిధుల్లో జీతాలివ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రీన్‌ అంబాసిడర్‌లకు జిల్లాలో 5 నుండి 20 నెలలకుపైగా వేతన బకాయిలు ఉన్నాయన్నారు. నెల క్రితం ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను కేటాయించిన నిధుల్లో హరిత రాయ బారులకు 50 శాతం వేతనాలకు ఇవ్వాల్సి ఉండగా జిల్లా పంచాయతీ అధికా రులు ఇవ్వకుండా జాప్యం చేయడం తగదన్నారు. కాటిమాయకుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునను జీతాలడిగిన వర్కర్లను బూతులు తిడుతున్నారని పని మానేయండి, నన్ను అడగొద్దు ఎంపని చేస్తున్నారు అంటూ చిందులేశారని తెలిపారు. విషయం తెలుసుకున్న అతనికి అనేక సార్లు ఫోన్‌ చేసినా స్పదించలేదని, కార్మికులు దళితులు పేదవారు కావడంతో బెదిరిస్తు న్నారని తెలిపారు. కాటిమాయకుంటకు రెండు సంవత్సరాల నుండి విడుదల చేసిన నిధులు మీద విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల. పట్ల అసభ్యంగా ప్రవర్తన చూపిన మల్లికార్జున మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయనపై రెండు సంవత్సరాల నుండి చేసిన పనికి వేతనాలు రాక అప్పులు చేసి తీవ్ర ఇక్కట్లలో ఉన్న ప్రజారోగ్యం కొరకు చిత్తశుద్ధి తో స్వచ్ఛతా హీ సేవా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ, గ్రీన్‌ అంబాసిడర్‌ల శ్రమ అభినం దనీయమని పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్బంగా జిల్లాలో కార్మికులకు సన్మానాలు చేశారని అయితే వీరికి ప్రధానంగా పెండింగ్‌ బకాయిలు విడుదల చేయడంతో పాటు పెరిగిన ధరలకునుగుణంగా కనీస వేతనం రూ.26 వేల వేతనం ఇవ్వాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి పట్టే ప్రమాదముందని కలెక్టర్‌ పంచాయతీ విభాగం మీద జోక్యం చేసుకుని కార్మికుల వేతనాల మీద దృష్టి సారించాలని కోరారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌లకు కేవలం రూ.6 వేలు ఇవ్వడం దారుణమని కనీస వేతనం అమలు చేయాలన్నారు. లేని పక్షాన సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

➡️