ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : స్థానిక వి.వి.ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ సైన్సెస్ కళాశాల విద్యార్థినులు ఈ నెల 9, 10 తేదీలలో విజయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ మహిళ కళాశాలలో నిర్వహింపబడిన విజయ విబ్రన్జ 2024 సాంస్కృతిక, ఆటల పోటీలలో గుడ్లవల్లేరులో బీఫార్మసీ చదువుతున్న విద్యార్థినులు పాల్గొని ప్రతిభను చూపించారు. ఇందులో బాగంగా ఆటల పోటీల్లో నిర్వహింప బడిన చెస్ లో పి. అనూష రెండవ స్థానం, షటిల్ డబుల్ యన్. సాయి శృతి బృందం రెండవ స్థానం , కో-కో- ఏం. జయ శ్రీ బృందం రెండవ స్థానం , కబడి- ఎం. నాగజ్యోతి బృందం రెండోవ స్థానాలు కైవసం చేసుకున్నారు. సాంస్కృతిక పోటీల్లో భాగంగా నిర్వహించబడిన, పాటలలో-వై.ప్రణతి మొదటి స్నానాన్ని, ఎం.నాగ హరిప్రియ రెండవ స్థానంలో నిలిచారు. నృత్య ప్రదర్శనలో- జె. కాంక్ష రెండవ స్థానంలో నిలిచి మొత్తం చాంపియన్ షిప్ ను కైవసం చేసుకొని 11,500 నగదు బహుమతిని గెలుపొందారు. విజయం సాధించిన విద్యార్థినులను ప్రశంసా పత్రాలతో పాటు మొమెంటు ఇచ్చి బహూకరించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.లక్ష్మణ్ రావు, అధ్యాపకులు డాక్టర్.షేక్.అమీనాబి, డాక్టర్. పి.రవీష, డాక్టర్. టి. ప్రశాంతి, డాక్టర్ టి.బాలకృష్ణ, బి.సత్య శ్రీ, టి.శ్రావణి, డాక్టర్ ఏ.సాయిధాత్రి, డాక్టర్ వి.రజని, వి.ఎల్.వినోద్ కుమార్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.