ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : గుడివాడ ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంవారు ఈ నెల 10 తేదీ శుక్రవారం సంక్రాంతి సందర్భంగా పండగ సంబరాలను గుడివాడ, గుడ్లవల్లేరు మరియు నందివాడ మండలాల వారికీ క్రీడా పోటీలు నిర్వహించగా, గుడ్లవల్లేరు ఎ.ఎ.ఎన్.ఎమ్ అండ్ వి.వి.ఆర్.ఎస్.ఆర్ పాలిటెక్నిక్ విద్యార్థులు కబడ్డీలో పలు జట్లతో తలబడి విజేతలుగా నిలిచారని ప్రిన్సిపాల్ ఎన్.రాజశేఖర్ శనివారం తెలిపారు. ఎన్.టి.ఆర్.స్టేడియం కమిటీ వారు సాంప్రదాయ పండుగలలో ఇలాంటి విన్నూత్న ఆటలపోటీలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఎన్.టి.ఆర్.స్టేడియం కమిటీ వైస్ చైర్మన్, జాయింట్ సెక్రటరీ చేతులమీదుగా విజేతలకు ప్రశంస పత్రం, జ్ఞాపికలను అందించడం జరిగింది. బహుమతులు సాధించిన విద్యార్థులను, వారికీ సహకరించిన ఫీజికల్ డైరెక్టర్ వి.శ్రీనివాసరావు, సహాయ ఫీజికల్ డైరెక్టర్ భవదీప్ లను పాలిటెక్నిక్ యాజమాన్య సభ్యులు చైర్మన్ డా.వల్లూరుపల్లి నాగేశ్వర రావు, సెక్రటరీ కరెస్పాండెంట్ శ్రీ వి.సత్యనారాయణ రావు, కో – సెక్రటరీ కరెస్పాండెంట్ శ్రీ వి.రామకఅష్ణ , అకాడమిక్ డెవలప్మెంట్ కోర్డినేటర్ జి.వి.వి.సత్యనారాయణ, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఎన్.రాజశేఖర్ వివిధ విభాగాల శాఖాధిపతులు అభినందించారు.