గుడ్లూరు పోలీస్టేషన్‌ దిగ్బంధనం

Sep 30,2024 21:22
గుడ్లూరు పోలీస్టేషన్‌ దిగ్బంధనం

పోలీస్టేసన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న దళితులు
గుడ్లూరు పోలీస్టేషన్‌ దిగ్బంధనం
పజాశక్తి-గుడ్లూరు : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన అశోక చక్రవర్తి (13) మతికి కారణమైన ట్రాక్టర్‌ యజమాని, డ్రైవర్‌ పై కేసు నమోదు చేసి తీవ్రంగా నష్టపోయిన బాధితు కుటుంబానికి న్యాయం చేయాలని గుడ్లూరు మండలం అడవిరాజుపాలెం ఎస్‌సి కాలనీకి చెందిన సుమారు 400 మంది గ్రామస్తులు గుడ్లూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి సోమవారం ఆందోళన చేపట్టారు. పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా వందలాదిమంది బైఠాయించడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు తెగిన బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం సోమవారం గుడ్లూరు పోలీస్‌ స్టేషన్‌ కి మహాప్రస్థానం ద్వారా తీసుకువచ్చారు. పోలీస్టేషన్‌ ఆవరణంలో ఉన్న వందలాది మంది గ్రామస్తులు న్యాయం జరిగే వరకూ బాలుడు మృతదేహాన్ని వాహనం నుంచి దించటానికి వీలేద ఆపేశారు. మండలంలోని పలు గ్రామాల నుంచి ఎస్సీ కాలనీలకు చెందినవారు గుడ్లూరు పోలీస్‌ స్టేషన్‌ దగ్గరికి చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కందుకూరు నుంచి అదనపు పోలీసు బలగాలు వచ్చాయి. కేసు నమోదు చేయకపోవడంపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఆటో ట్రాక్టర్‌ ఢకొీన్న ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలు తగలగా ఒకే కుటుంబానికి చెందిన తల్లి, తండ్రి కుమారుడు కి గాయాలు తగిలి ఆస్పత్రిపాలయ్యారు. .గాయపడిన వారిలో కుమా రుడు మరణించగా బాలుడు తండ్రి ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉండడంతో పరిస్థితిని ఇప్పటివరకు సమీక్షించకుండా పోలీసులు పట్టించ ుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. . ట్రాక్టర్‌ యజమాని దగ్గర మామూలు తీసుకున్న పోలీసులు కేసును నీరు కారుస్తున్నారని ఎస్సీ కాలనీ గ్రామస్తులు ఆరోపించారు.

➡️