క్రోచెట్స్‌ స్క్వెర్‌లో గిన్నీస్‌ రికార్డు

ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురం పట్టణానికి చెందిన కొండెపోగు స్వాప్నికా రాజ్ఞ క్రోచెట్స్‌ స్క్వేర్‌లో గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది. విశాఖపట్నం వెంకోజి పాలెంలోని సిఎంఆర్‌ ఫంక్షన్‌ హాలులో 22న ‘మహిళా మనోవికాస్‌ క్రాఫ్ట్స్‌ అండ్‌ క్రియేషన్స్‌ సంస్థ’ నిర్వహించిన ప్రదర్శ నలో మార్కాపురం పట్టణానికి చెందిన కొండేపోగు స్వాప్నికా రాజ్ఞ పాల్గొన్నారు. ఆమె తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. ఈ పోటీల్లో 450 మంది మహిళలు 58,112 క్రోచెట్స్‌తో పాల్గొన్నారు. లార్జెస్ట్‌ డిస్‌ప్లే ఆఫ్‌ క్రోచెట్స్‌ స్క్వెర్‌ను మార్కాపురం వాసి స్వాప్నికా రాజ్ఞ తయారు చేశారు. ఈ ప్రదర్శనలో ఆమె విజేతగా నిలిచింది. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు సొంతం చేసుకుంది. మెమోం టోతో పాటు గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు ప్రశంసాపత్రం అందుకు న్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారందరూ తయారు చేసిన వస్తువులను ఉచితంగా అనా థలకు పంపిణీ చేస్తామని నిర్వా హకులు తెలిపారు. స్వాప్జికా రాజ్ఞ ఎంబిఎ, ఎం.ఫార్మశి చదువుకున్నారు. వైద్యారోగ్య శాఖలో ఫార్మసీ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందారు. ఆమె ఓ వైపు వైద్య వృత్తిలో రాణిస్తూ ప్రవృత్తిగా ‘క్రోచెట్స్‌ స్క్వెర్‌’ను ఎంచుకున్నారు. ప్రస్తుతం ఆమె త్రిపురాంతకం మండలంలోని దూపాడు పిహెచ్‌సిలో ఫార్మశిస్ట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

➡️