ప్రజాశక్తి- అద్దంకి : తుది శ్వాస వరకూ సిపిఎం జెండాను మోస్తూ ప్రజా సమస్యలపై పోరాడిన గొప్ప వ్యక్తి సిఐటియు నాయకులు గుంజి వెంకట్రావు అని సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్. గంగయ్య తెలిపారు. సిఐటియు నాయకులు వెంకట్రావు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. ఆయన మృతదేహంపై నాయకులు శుక్రవారం ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సిఐటియు మండల కార్యదర్శిగా, సిపిఎం మండల నాయకులుగా గుంజి వెంకట్రావు పనిచేసినట్లు తెలిపారు. సిపిఎంలో పనిచేస్తే వ్యక్తుల చర్యలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయని గుంజి వెంకట్రావు ముందుగానే గ్రహించి తాను మరణాంతరం తన మృతదేహాన్ని సమాజానికి ఉప యోగపడేలా హాస్పిటల్‌కు ఇవ్వాలని తమ కుటుంబ సభ్యులకు తెలిపినట్లు ఆయన వివరించారు. కుటుంబ సభ్యుల అంగీకారం గుంజి వెంకట్రావు మతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. నివాళులర్పించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్. గంగయ్య, కార్యవర్గ సభ్యులు మజుందర్, జిల్లా నాయకుడు మోండ్రు ఆంజనేయులు, పట్టణ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, బి.విజరు కుమార్, పట్టణ మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.
