గుండెపోటుతో అమరావతి దళిత జేఏసీ కన్వీనర్‌ లూథర్‌ మృతి

Jan 20,2024 16:08 #dalitha, #gunter, #leader death

ప్రజాశక్తి-తుళ్లూరు(గుంటూరు) : అమరావతి దళిత జెఎసి కన్వీనర్‌, టిడిపి నాయకులు గడ్డం మార్టిన్‌ లూథర్‌ (51) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని ప్రాంతం మందడం గ్రామానికి చెందిన మార్టిన్‌కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు మణిపాల్‌ హాస్పిటల్‌కు తరలించాగా.. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దళిత జెఎసి కన్వీనర్‌గా మార్టిన్‌ అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. మార్టిన్‌ మృతి పట్ల రాజధాని అమరావతి రైతులు, రైతు కూలీలు, మహిళలు, రైతు, మహిళా, మైనార్టీ జెఎసి, రాజధాని డివిజన్‌ కమిటి నాయకులు ఎం.రవి, ఎం.భాగ్యరాజు విచారం వ్యక్తం చేశారు.

➡️