ప్రజాశక్తి-ఏఎన్ యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏపీ పీజీ సెట్ లో ప్రతిభ కనబరిచిన మొదటి ర్యాంకర్ లకు అభినందన సభను బుధవారం నిర్వహించారు. సభకు జిల్లా అధ్యక్షులు కె.రూపస్ అధ్యకత వహించారు. సభలో ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. కిరణ్, నాయకులు ఉపేంద్ర, నవిత, సీఐటీయూ నాయకులు కె. భాను ప్రసాద్ పాల్గొన్నారు. ర్యాంకర్లకు బహుమతులను అందజేశారు.