ప్రజాశక్తి-మంగళగిరి : మంగళగిరి ఆటోనగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. విజయ పికిల్స్ ఎదుట షాప్ నెంబర్ 139 వద్ద ప్లాస్టిక్ సామాగ్రి కాలిపోయింది. పక్కనే విద్యుత్ స్తంభాలు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురైయ్యారు. ఫైర్ ఇంజన్ తో ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.