- హాజరుకానున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్
ప్రజాశక్తి – ఎడ్యుకేషన్ (విజయవాడ) : కోనేరు లక్ష్మయ్య (కెఎల్) డీమ్డ్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం ఈ నెల 30న వడ్డేశ్వరంలోని వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ఉపకులపతి డాక్టర్ జి.పార్ధసారథి వర్మ తెలిపారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ స్నాతకోత్సవానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ తదితర ప్రముఖులు గౌరవ అతిథులుగా పాల్గొంటారని చెప్పారు.