కన్నతల్లే కాదనుకుంది

Jan 7,2025 17:39 #guntur

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : పేగు తెంచుకొని పుట్టిన పసి గుడ్డే కన్నతల్లికి బరువైంది. నవ మాసాలు మోసి, పురిటి నొప్పులతో, ప్రసవ వేదన అనుభవించి, కన్న బిడ్డని కడ తీర్చిన ఆ కసాయి తల్లి ఎవరో? ఆ పసికందు కళ్ళు తెరిచి లోకాన్ని చూసిన గంటల వ్యవధిలోనే, మానవత్వాన్ని మంటగలిపి, కాటికి సాగనంపింది. ఈ దుర్మార్గపు ఘటన ఎo టి యం సి పరిధిలోని కొలనుకొండ గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఇంతకీ ఆ పసికందు చేసిన పాపం ఏంటి? ఆ కర్కస తల్లి కడుపున పుట్టడమేనా? ఏ తల్లి కన్న బిడ్డో .. ఇలా మురికి కాలువలో ప్రాణాలు వదలాల్సి వచ్చింది అంటూ పలువురు గ్రామస్తులు కాలువలో ప్రాణాలు వదిలిన పసి గుడ్డును చూసి చలించి పోతున్నారు. ఆ కసాయి తల్లి చేసిన అఘాయిత్యానికి ఆశ్చర్యపోతున్నారు. విషయం తెలుసుకున్న తాడేపల్లి పోలీసులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

➡️