ప్రజాసంఘాల నాయకులు
ప్రజాశక్తి-చల్లపల్లి : కృష్ణ గుంటూరు జిల్లాల ఉమ్మడి గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పిడిఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్ రావు గెలుపు కోరుతూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం ప్రచారం నిర్వహించారు. చల్లపల్లి మండల కేంద్రంలోని, తాసిల్దార్, మండల పరిషత్, విద్యుత్, విద్యాశాఖ అధికారి, వెలుగు, ఉపాధి హామీ పథకం కార్యాలయంలో, వ్యవసాయ శాఖ ఆర్ అండ్ బి, సచివాలయ కార్యాలయంలో తోపాటు ప్రభుత్వ ప్రైవేటు విద్య శాలలో ప్రచార నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, పెన్షనర్స్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు, కర్షక, మహిళ, వివిధ ప్రజాసంఘాలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మణరావు గెలిపించాలని కోరారు. రెండుసార్లు టీచర్స్ ఎమ్మెల్సీ గాను ఒకసారి గ్రాడ్యుటి ఎమ్మెల్యేగా గెలుపొంది కృష్ణ గుంటూరు జిల్లాలలో నిర్మాణాత్మకమైన కృషి చేశారని వివరించారు. నీతి నిజాయితీగా నిబద్దతతో పనిచేసే వ్యక్తి కేసు లక్ష్మణరావుకు ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని నేతలు కోరారు. ప్రచార కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యద్దనపూడి మధు, సిఐటియు మండల కార్యదర్శి మహమ్మద్ కరీముల్లా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బళ్లా తదితరులు పాల్గొన్నారు.
